: భారత్ బలగాల మెరుపుదాడి అభినందనీయం: చంద్రబాబు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో భారత బలగాలు మెరుపు దాడులు చేయడం అభినందనీయమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లితే సమర్థంగా తిప్పికొడతామని మన సైనికులు నిరూపించారని అన్నారు. ఈ సందర్భంగా వారికి తన అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్రానికి చంద్రబాబు సూచించారు.