: సైనికులకు సెలవులు రద్దు.. ఆర్మీ ఆదేశాలు
భారత సైన్యానికి సెలవులు రద్దు చేశారు. సెలవుల్లో ఉన్న సైనికులంతా తమతమ ఆర్మీ యూనిట్లకు చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. యుద్ధమేఘాలు ముసురుకున్న ప్రస్తుత తరుణంలో సైనికులంతా అందుబాటులో ఉండాలని సైన్యం భావిస్తోంది. ఇప్పటికే అదనపు బలగాలను సరిహద్దుల్లో మోహరించింది. మరిన్ని బలగాలను సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధంగా ఉంది. ఏ క్షణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకున్నా తీవ్రంగా ప్రతిస్పందించేందుకు తయారుగా ఉండాలని సైన్యానికి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సమరోత్సాహంతో భారతసైన్యం సిద్ధమవుతోంది.