: అన్ని పార్టీల నేతలు సైన్యాన్ని అభినందించారు: సీఎం రమేష్
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నేతలు సైన్యాన్ని అభినందించారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ఢిల్లీలో పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ కు ఇండియన్ ఆర్మీ తగిన బుద్ధి చెప్పిందని అన్నారు. నిఘా వర్గాల పూర్తి సమాచారంతో మన ఆర్మీ ఉగ్రవాదులపై దాడులు చేసిందని ఆయన చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ కు ఇండియన్ ఆర్మీ తగిన బుద్ధి చెప్పిందని ఆయన కొనియాడారు.