: పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన భారత్ కుర్రాళ్లు.. హాకీలో సత్తా చాటిన ఇండియా


భారత్ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ తో ఓపక్క కుతకుతా ఉడికిపోతున్న పాకిస్థాన్ ను భారత కుర్రాళ్లు చిత్తుగా ఓడించి మరో చేదు అనుభవం మిగిల్చారు. వివరాల్లోకి వెళ్తే... బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ అండర్-18 హాకీ టోర్నీలో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆది నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో 3-1 తేడాతో భారత్ కుర్రాళ్లు పాకిస్థాన్ జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్ లోకి దూసుకెళ్లారు. టైటిల్ పోరు రేపు జరగనుంది. భారత్ కు ఇది మరో శుభవార్త కాగా, పాకిస్థాన్ కు ఇది ఇబ్బందికరమైన వార్త అనడంలో ఎలాంటి సందేహం లేదు.

  • Loading...

More Telugu News