: ముగిసిన అఖిలపక్ష సమావేశం.. భారత సైన్యానికి అభినందనలు తెలిపిన నేతలు
నియంత్రణ రేఖను దాటి భారత సైన్యం చేసిన దాడిలో 38 మంది ఉగ్రవాదులను హతమార్చిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఏర్పడిన పరిస్థితులపై ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాయంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. నార్త్ బ్లాక్‌లో అన్ని పార్టీల నేతలతో చర్చించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. భారత సైన్యం చేసిన సాహసానికి అఖిల పక్షం అభినందనలు తెలిపింది. ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశిస్తున్న తీరు, వాటిపై తీసుకుంటున్న చర్యలను రాజ్‌నాథ్‌సింగ్ అన్ని పార్టీల నేతలకి వివరించి చెప్పారు.