: అవునా?...నిజమా?... ఏందబ్బా ఆ సినిమా?... నేను నటిస్తున్నానా?...నాకు తెలీదే!: రానా


మీడియాలో వచ్చే కొన్ని గాసిప్ వార్తలు ఎంతటి వారినైనా ఆశ్చర్యంలో ముచెత్తుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ నటుడు రానా 'ఘాజీ' షూటింగ్ లో బిజీగా ఉండగా... మరోపక్క మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి రానా ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటించనున్నాడంటూ ఫిల్మ్ నగర్ లో ఓ వార్త హల్ చల్ చేసింది. దీనిని చూసిన రానా.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. అవునా? నిజమా? నేను మోహన్ లాల్ సర్ తో భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నానా? నాకు తెలీదే! అంటూ ఆశ్చర్యపోయాడు. మోహన్ లాల్ సర్ తో నటించడం గర్వకారణమే కానీ ఇది వాస్తవం కాదు అని స్పష్టం చేశాడు. అయితే ఇది తనకు వార్తేనని అన్నాడు.

  • Loading...

More Telugu News