: పెడన మున్సిపల్ చైర్మన్ పదవి వైసీపీకే.. ఓటింగ్ లో టీడీపీకి షాక్ ఇచ్చిన ఆ పార్టీ కౌన్సిలర్


పెడన మున్సిపల్ చైర్మన్ మృతి చెందడంతో ఆ స్థానం కోసం నిర్వ‌హించిన ఓటింగ్ లో టీడీపీకి గ‌ట్టిదెబ్బే త‌గిలింది. పెడన మున్సిపల్ చైర్మన్ పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కేవలం ఒక్క ఓటు తేడాతో ఆ స్థానాన్ని కైవ‌సం చేసుకుని సంబ‌రాల్లో మునిగిపోయింది. తెలుగు దేశం పార్టీకి చెందిన కౌన్సిలర్ స్రవంతి వేసిన ఓటు ఫ‌లితాల‌ను తారుమారు చేసింది. వైసీపీ చైర్మన్ అభ్యర్థి బండారు ఆనంద్ ప్రసాద్ కు ఆమె ఓటు వేశారు. మున్సిపాలిటీకి గతంలో ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో మొత్తం 22 స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు 11 మంది, టీడీపీ అభ్య‌ర్థులు 11 మంది గెలిచి కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకటరావు ఎక్స్ అఫీషియో సభ్యుడుగా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా, చైర్మన్ స్థానాన్ని వైసీపీ ద‌క్కించుకున్న నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News