: పాక్ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్.. ఆయా ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న భద్రతా బలగాలు
పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇరు దేశాలకి మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి భారీగా సైన్యాన్ని మోహరింపజేశారు. పాక్ నుంచి ప్రతిదాడులు జరగవచ్చని భావిస్తున్న భారత్ వాటిని తిప్పి కొట్టడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సర్వసన్నద్ధంగా అందుకు కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటోంది. జమ్ముకశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాలను భారత భద్రతా బలగాలు ఖాళీ చేయిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో విద్యాలయాలు మూతబడ్డాయి.