: సర్జికల్ స్ట్రయిక్స్ ప్రభావం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


నిర్దేశిత దాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) ప్రభావంతో ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ, నియంత్రణ రేఖ ఆవల నిర్దేశిత దాడుల గురించి ఆర్మీ ప్రకటన అనంతరం స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపి, షేర్ల విక్రయాలను అమాంతం పెంచేయడంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 465 పాయింట్లు నష్టపోయి 27,827 పాయింట్ల వద్ద, నిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి, 8,591 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈ లో బీహెచ్ఈఎల్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ కంపెనీ షేర్లు 7 శాతానికి పైగా పడిపోయాయి. ఇంకా నష్టపోయిన సంస్థల షేరల్లో అదానీ పోర్ట్స్, హిందాల్కో, అరబిందో ఫార్మా, బ్యాంక్ఆఫ్ బరోడా ఉన్నాయి. ఓఎన్జీసీ, ఐటీసీ, టీసీఎస్, ఇన్ ఫ్రాటెల్, మహీంద్రా అండ్ మహీందా సంస్థల షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.

  • Loading...

More Telugu News