: సర్జికల్ స్ట్రయిక్స్ మా ప్రాంతంలో కూడా నిర్వహించండి : బలూచిస్తాన్ మద్దతుదారులు
ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకుగాను నియంత్రణ రేఖ దాటి భారత సైన్యం నిర్వహించిన నిర్దేశిత దాడుల (సర్జికల్ స్ట్రయిక్స్) తరహాలోనే తమ ప్రాంతంలో కూడా భారత్ నిర్వహించాలని బలూచిస్తాన్ మద్దతుదారులు కోరారు. బలూచిస్తాన్ మద్దతుదారుల నాయకుడు మజ్దాక్ దిల్సాద్ బాలోచ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం ముందు ఈరోజు మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. అనంతరం బలూచిస్తాన్ మద్దతుదారులు మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ ఎటువంటి చర్యలకు పాల్పడినా, ఏమి చేసినా తమ మద్దతు ఉంటుందంటూ పేర్కొన్నారు.