: 'వ్యవసాయం దండగ' అనే అభిప్రాయం చంద్రబాబులో ఇప్పటికీ మారలేదు: బొత్స సత్యనారాయణ


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఈరోజు గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న అక్క‌డి కాకుమాను మండలంలోని వరద ముంపు ప్రాంతాల ప‌రిస్థితి గురించి ప్ర‌జ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. రైతులు త‌మ బాధ‌ల‌ను బొత్సతో చెప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... వ్యవసాయం దండగన్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసే సీఎం చంద్రబాబు ఇంకా ఆ వాద‌న‌లోంచి బయటకు రాలేదని వ్యాఖ్యానించారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సు జ‌రిగితే అందులో చంద్ర‌బాబు నాయుడు వరద నష్టం గురించి చర్చించకపోవడం విచార‌క‌ర‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News