: మొత్తం ఆయనే చేశారు... పాక్ పై ఆర్మీ ఆపరేషన్ ఆయన కనుసన్నల్లోనే జరిగింది!


అవును, మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది. భారత సైన్యం వేగంగా పాకిస్థాన్ లోపలికి చొచ్చుకుపోవడం... మెరుపుదాడులు నిర్వహించడం... ధీమాగా వెనక్కి రావడం వరకు సర్జికల్ స్ట్రయిక్ ఆపరేషన్ మొత్తం రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కనుసన్నల్లోనే జరిగింది. టార్గెట్ ల ఎంపిక దగ్గర్నుంచి, వాటిపై దాడులు చేయబోయే విధానం, తిరిగి వెనక్కి వచ్చే ప్లాన్.. ఇలా ప్రతీదీ మనోహర్ పారికర్ కు చెప్పే భారత సైన్యం చేసినట్టు తెలిపింది. భారత త్రివిధ దళాధిపతులతో భేటీ జరిగిన సమయానికే భారత సైన్యం ఏడు ఉగ్రవాద శిబిరాలను ఎంచుకోవడం, అందులోని ఉగ్రవాదులను మట్టుబెట్టడం, వెనుదిరగడం వంటి పూర్తి స్థాయి ప్రణాళికపై మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఫైల్ పారికర్ చేతుల్లో ఉందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో ఉన్నట్టే పాక్ లోకి వెళ్లడం, ఎంచుకున్న ఏడు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడం, 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం.. అంతే వేగంగా వెనుదిరగడం జరిగిపోయాయి.

  • Loading...

More Telugu News