: ఎన్నిసార్లు చెప్పినా పాక్ వినిపించుకోలేదు.. సైన్యం తీసుకున్న చర్యలు సమర్థనీయం: వెంకయ్య
పాకిస్థాన్, ఇండియాకు మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణంపై, భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి ఉగ్రస్థావరాలపై చేసిన దాడి అంశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకూడదని పాక్‌కు తాము మొదట విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ పాక్ తమ బుద్ధిని మార్చుకోలేదని, తాము చెప్పిన మాటలను వినలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైన్యం తీసుకున్న చర్యలు సమర్థనీయమని ఆయన అన్నారు. ఉగ్రవాదం ఇండియాకు మాత్రమే కాదని, మొత్తం ప్రపంచానికే ప్రమాదమని వెంకయ్య అన్నారు.