: భారత్ కు అండగా ఉంటామని ప్రకటించిన అమెరికా
ఐక్య రాజ్య సమితి (యూఎన్ఓ) ప్రకటించిన ఉగ్ర వాద సంస్థలు, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన పాకిస్థాన్ తీరును తాము గమనిస్తున్నామని, ఉగ్రవాదంపై పోరాడుతున్న భారతదేశానికి సహకరిస్తామని అగ్ర రాజ్యం అమెరికా ప్రకటించింది. ఈమేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు ఫోన్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. యూరీ ఘటనకు సంబంధించిన పాక్ ను ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కాకపోతే, ఈ సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులపై చట్టపరమైన చర్యలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా కట్టుబడి ఉన్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.