: యుద్ధానికి సన్నద్ధం?... పాక్ సరిహద్దు ప్రాంతాలను ఖాళీ చేయాలని రాజ్‌నాథ్‌సింగ్ కీలక ఆదేశాలు
పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేశారు. పాక్ సరిహద్దులోని ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. ముఖ్యంగా పంజాబ్‌లో 10 కిలో మీటర్ల మేర ప్రజలను ఖాళీ చేయించాలని పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్ కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అఖిలపక్షంతో ఢిల్లీలో భేటీ ఏర్పాటు చేశారు. సరిహద్దు వద్ద చోటు చేసుకుంటున్న తీవ్ర పరిణామాలపై దేశంలోని అన్ని ప్రముఖ పార్టీల నేతలతో హోం మంత్రి కీలక చర్చలు జరపనున్నారు. పాక్ ఉగ్రవాదంపై పోరులో భాగంగా భారత్ యుద్ధానికి సన్నద్ధమయినట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్ భద్రత, రక్షణకు సిద్ధంగా ఉన్నామని, భారత్ నిన్న చేసిన దాడిని ఖండిస్తున్నామని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.