: బంగ్లాదేశ్ లో దుర్గాదేవి విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు


హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా దుర్గాదేవి విగ్రహాలను ధ్వంసం చేసిన ఘ‌ట‌న ఈశాన్య బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. ఢాకాకు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న హబీగంజ్‌ జిల్లాలోని ఫుతర్‌మతి గ్రామంలో కొందరు దుండ‌గులు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ... ఆ ప్రాంతంలో ముస్లింల ఆధిప‌త్యం ఉంద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే దేవుళ్ల విగ్ర‌హాలు తయారుచేసే వారికి, స్థానికులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే దుర్గాదేవి ప్ర‌తిమ‌లు ధ్వంసం అయినట్లు తాము అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఘ‌ట‌న‌పై ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఘ‌ట‌న‌పై ఎలాంటి కేసు పెట్ట‌లేదు.

  • Loading...

More Telugu News