: భారత్ సైనిక దాడులను ఖండించిన పాక్ ప్రధాని
గత రాత్రి నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన పాక్ ఉగ్రవాదులపై భారత్ సైన్యం చేసిన సునిశిత దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) ను పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండించారు. శాంతి నెలకొనాలనేదే తమ ఆకాంక్ష అని, తమను బలహీనులుగా భావించవద్దని పేర్కొన్నారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. పాకిస్థాన్ భూభాగంలోనే తాము ఈ దాడులు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ మీడియా సమావేశంలో ప్రకటించిన కొద్ది సేపటికే పాక్ ప్రధాని ఈ ప్రకటన చేయడం గమనార్హం.