: రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుది: తెలంగాణ మంత్రి ఈటల
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శల పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీల నేతలు మిడ్మానేరు ప్రాజెక్టుపై అవగాహన లేకుండా, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గతంలో రైతులపై కాల్పులు జరిపించారని, అటువంటి చరిత్ర ఆయనదని ఈటల అన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికే కృషి చేస్తోందని అన్నారు. ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నాయని, ప్రాజెక్టులపై విమర్శలు మానుకోవాలని ఆయన సూచించారు.