: పాక్ తీరుపై భారత్ సీరియస్.. భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘంతో మోదీ భేటీ
పాకిస్థాన్ తన దుస్సాహస చర్యలను ఆపకుండా మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన అంశంపై భారత్ సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. పాక్ తీరుపై ఆయన చర్చిస్తున్నారు. కశ్మీర్ సహా అన్ని సరిహద్దు ప్రాంతాల్లో భద్రతపై సమీక్ష జరుపుతున్నారు. పాకిస్థాన్‌కు దీటుగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. భద్రతాపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలను మోదీ సమగ్రస్థాయిలో సమీక్షిస్తున్నారు.