: నా ఇద్దరు కూతుళ్లు ఆ విధంగా చేస్తే అడ్డుచెప్పను..కానీ, దిగులుపడతాను: ఒబామా


అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఇటీవల సీఎన్ఎస్ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగారు. ‘మీ ఇద్దరు కూతుళ్లు ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తానంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు?’ అని ఆర్మీ మాజీ అధికారి ఒకరు ఈ ప్రశ్నవేయగా.. అందుకు, ఒబామా స్పందిస్తూ.. తన ఇద్దరు కూతుళ్లు ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తానంటే అందుకు తాను అడ్డు చెప్పనని, అయితే, వారి గురించి మాత్రం తండ్రిగా దిగులు చెందుతానంటూ కూతుళ్లపై ఒబామా తండ్రి ప్రేమను కనబర్చారు. అనంతరం, ఫోర్ట్ లీ మిలిటరీ బేస్ క్యాంపులో ఒబామా మాట్లాడుతూ, దేశ భక్తి, క్రమశిక్షణ విషయంలో ఆర్మీ తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు. ఆర్మీలో ఉన్నత వర్గాల ప్రాతినిధ్యం పెరగాలని కోరారు. పిల్లలు, స్వేచ్ఛ గురించి ఒబామా ప్రస్తావిస్తూ, ‘మీ పిల్లలు ఎప్పటికీ మీ పిల్లలే. వారిని స్వేచ్ఛగా వదిలేయండి. అప్పుడే వారు అభివృద్ధి చెందుతారు’ అని సూచించారు.

  • Loading...

More Telugu News