: నాణ్యత లోపించిన జాదూ పత్తివిత్తనాలు.. ‘కావేరీ సీడ్స్’ లైసెన్స్ తాత్కాలిక రద్దు
కావేరి సీడ్స్ కు చెందిన జాదూ పత్తి విత్తనాలు నాణ్యతా రహితంగా ఉన్నాయంటూ రైతుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సంస్థ లైసెన్స్ ను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిలకలూరిపేట, అచ్చంపేట మండలాల రైతులు ఈ మేరకు చేసిన ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన అనంతరం వ్యవసాయ శాఖ ఒక నివేదికను తయారు చేసిందని, ఈ నివేదికల ఆధారంగా కావేరి సీడ్స్ సంస్థ లైసెన్స్ ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కావేరి సీడ్స్ సంస్థపై రద్దు ఆదేశాలు అమలులో ఉంటాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.