: ఓటుకు నోటు కేసు విచారణ అక్టోబరు 24వ తేదీకి వాయిదా


ఓటుకు నోటు కేసు విచారణ అక్టోబర్ 24వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహలు ఈరోజు పాతబస్తీలోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అయితే, సెబాస్టియన్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. కాగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తగినంత బలం లేకపోయినా అభ్యర్థిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు లంచం ఇస్తూ దొరికిపోయిన రేవంత్ రెడ్డిని గతంలో ఏసీబీ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. తాజగా, ఈ కేసును మళ్లీ విచారిస్తుండటంతో రేవంత్ మళ్లీ కోర్టుకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News