: సింగపూర్ కంటే శ్రీకాకుళం విస్తీర్ణం ఎన్నోరెట్లు ఎక్కువ.. తలసరి ఆదాయం పెరిగేలా చూడండి : సీఎం చంద్రబాబు


సింగపూర్ దేశం కంటే మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా విస్తీర్ణం 8 రెట్లు ఎక్కువ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు జరుగుతున్న రెండోరోజు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, విస్తీర్ణంలో ఎన్నోరెట్లు ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం జిల్లా జనాభా విషయంలో సింగపూర్ కంటే 50 శాతం తక్కువ అని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 197 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందని, తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రెండేళ్లలో శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తామని, రెండేళ్లలో జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని హామీ యిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఖాళీగా ఉన్న జేసీ పోస్టు భర్తీ చేయాలని, దీనివల్ల భూ సంబంధ సమస్యలు పరిష్కరించగల్గుతామని, ఏఏ ప్రాజెక్టులతో ముందుకెళ్లాలో ప్రణాళికలు చేస్తామని, వాటి అమలుపై వివరాలు అందిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News