: ఓటుకు నోటు కేసు.. మరికొద్ది సేపట్లో ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా లు ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ జరగనుంది. కాగా, ఈ కేసు విచారణకు హాజరుకావాల్సిందిగా గత నెలలోనే వారికి ఏసీబీ సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం 10.30 గంటలకు వీరు కోర్టు ముందు హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేసింది.