: ఆ హీరో నన్ను సడెన్‌గా దూరం పెట్టాడు.. వాపోతున్న కాజల్
తన లగ్జరీ కారును విపరీతంగా వాడేసుకున్న ఓ హీరో తనను సడెన్‌గా దూరం పెట్టాడని టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ తెగ బాధపడిపోతోంది. ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో చాన్స్ కొట్టేయడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇటీవల ఆమె తన స్నేహితులతో ఓ హీరో గురించి ఫిర్యాదు చేస్తూ వాపోయినట్టు ఫిల్మ్‌నగర్ న్యూస్. బాలీవుడ్‌లో అవకాశాల కోసం చేసిన ప్రయత్నం విజయవంతమై షాహిద్ కపూర్ సరసన నటించేందుకు ఎంపికైంది. ఈ సినిమా కథా చర్చల సమయంలో షాహిద్‌తో విపరీతమైన చనువు ఏర్పడిందట. ఆ సందర్భంగా తన లగ్జరీ కారును షాహిద్ విపరీతంగా వాడుకున్నాడట. అయితే చివరికి సినిమా తెరకెక్కుండా కథా చర్చల సమయంలోనే అది చతికిల పడింది. సినిమా ఆగిపోయన తర్వాత షాహిద్ సడెన్‌గా తనతో మాట్లాడడం మానేశాడని, కనీసం ఫోన్ కూడా చేయలేదంటూ స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిందట కాజల్. ఈ విషయం కాస్తా బయటపడడంతో టాలీవుడ్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది.