: మార్కెట్లోకి లావా 4 జీ స్మార్ట్‌ఫోన్ ఏ97.. ధర 5,949


దేశీయ మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ లావా బుధవారం 4జీ చౌక మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఏ 97 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ధరను రూ.5,949గా పేర్కొంది. ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టం కలిగిన ఈ ఫోన్ 12 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ముందు, వెనక వైపున 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. తక్కువ కాంతిలో మంచి క్వాలిటీతో ఫొటోలు తీసుకునేందుకు ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ అమర్చారు. ఫేస్‌బ్యూటీ, జిఫ్ మోడ్, వీడియో ఇమేజెస్ కాప్చర్, ఆడియో పిక్చర్లను ఇమేజ్‌లుగా సేవ్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే 5 అంగుళాల డిస్ప్లే, 1.3 జీహెచ్ జీ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, ఇన్‌బుల్ట్ మెమరీ 8 జీబీ. అవసరం అనుకుంటే 32 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటున్న ఈ ఫోన్‌ అన్ని రిటైల్, మల్టీబ్రాండ్ అవుట్ లెట్లలో అందుబాటులో ఉంది.

  • Loading...

More Telugu News