: మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ సంస్థ నుంచి 30 కేజీల బంగారు ఆభరణాలు చోరీ


దొంగలు మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ ను లక్ష్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇతర గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలపై జరిగే చోరీల కంటే మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ సంస్థల్లో ఎక్కువ జరుగుతున్నాయి. తాజాగా, మహారాష్ట్రలో నాగపూర్‌ లోని జరిపట్క్ ప్రాంతంలోని మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ ఆఫీస్‌ నుంచి 30 కేజీల బంగారం దోచుకెళ్లారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఆ బ్రాంచ్ లో బంగారం తనఖా పెట్టిన ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.

  • Loading...

More Telugu News