: లోధా కమిటీ సిఫారసులు అమలు చేస్తారా? లేక మమ్మల్ని చేయమంటారా?: సుప్రీం కన్నెర్ర


లోథా కమిటీ సిఫారసులు అమలు చేస్తారా? లేక చేయమంటారా? అంటూ బీసీసీఐపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. లోథా కమిటీ సిఫారసులు అమలు చేయడంలో బీసీసీఐ ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు పట్టింది. లోథా కమిటీ బీసీసీఐ తీరుతెన్నులపై నేడు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. రాజకీయాలతో సంబంధం ఉన్న బీసీసీఐ అధ్యక్షుడితో పాటు ఇతరులను తొలగించడంలో బీసీసీఐ అశ్రద్ధ చూపిస్తోందని కమిటీ న్యాయస్థానానికి తెలిపారు. దీంతో మండిపడిన సుప్రీంకోర్టు ‘‘బీసీసీఐ అధికారులు తమను తాము దేవతలనుకుంటున్నారా? మర్యాదగా దారిలోకి వస్తారా ? లేక దారిలోకి తీసుకురావాలా?’’ అని హెచ్చరించింది. లోథా కమిటీ సిఫారసులు అమలు చేసేందుకు బీసీసీఐ మరింత సమయం కావాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News