: వరంగల్ రైల్వే స్టేషన్ లో కోటిన్నర విలువ చేసే 4 కేజీల బంగారం స్వాధీనం
వరంగల్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు సుమారు కోటిన్నర విలువైన 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ బంగారాన్ని తీసుకొస్తున్నట్టు గుర్తించారు. దీంతో నాలుగు కేజీల బంగారాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వేపోలీసులు బంగారం తీసుకువస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బంగారం ఎవరిది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వంటి వివరాలు కూపీ లాగుతున్నారు.