: రష్యా క్షిపణితోనే మలేసియా విమానాన్ని ఉక్రెయిన్ రెబల్స్ కూల్చేశారు
2014, జూన్ 17న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో మలేషియా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం ఎంహెచ్ 17ను ఉక్రెయిన్ రెబల్స్ రష్యా క్షిపణితో కూల్చివేశారని దీనిని విచారించిన అంతర్జాతీయ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ మేరకు ఆమ్ స్టర్ డ్యామ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనిపై విచారణ నిర్వహించిన డచ్ కమిటీ మాట్లాడుతూ, రష్యాకు చెందిన బక్ 9ఎం38 మిసైల్ తో రెబల్స్ ఆ విమానాన్ని పేల్చివేశారని అన్నారు. రష్యా నుంచి తీసుకువచ్చిన బక్ క్షిపణి వ్యవస్థ గురించి ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు చర్చిస్తున్న ఫోన్ సంభాషణను వారు మీడియాకు వినిపించారు. దీని ద్వారానే వారు మలేషియా విమానాన్ని పేల్చేశారని నిర్ధారించారు. ఈ క్షిపణిని రష్యా నుంచి దిగుమతి చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని వారు వెల్లడించారు.