: సీబీఐ అధికారులు నన్ను, నా కుటుంబాన్ని వేధించారు... చిత్రహింసలు పెట్టారు: సూసైడ్ నోట్ లో బీకే బన్సాల్


కార్పోరేట్ వ్యవహారాల శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ బీకే బన్సాల్ ఆత్మహత్య కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బన్సాల్ రాసిన ఏడు పేజీల సూసైడ్ నోట్ లో, గతంలో విచారణ పేరుతో సీబీఐకి చెందిన మహిళా అధికారులు తన భార్యను దుర్భాషలాడుతూ తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. సీబీఐ వేధింపులు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, డీఐజీ ర్యాంకుకు చెందిన ఒక సీనియర్ అధికారి తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడని ఆ సూసైడ్ నోట్ లో ఆరోపించారు. తన కుటుంబాన్ని వేధింపుల పాలు చేసిన సీబీఐ అధికారుల పేర్లను అందులో ఆయన పొందుపరిచారు. డీఐజీ ర్యాంకు అధికారి సహా సీబీఐ అధికారులపై దర్యాప్తు చేయించాలని బన్సాల్ తన సూసైడ్ నోట్ లో కోరారు. కాగా, ఒక ఫార్మా కంపెనీ నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ అధికారులు బన్సాల్ ను గతంలో అరెస్టు చేశారు. అవమానభారంతో బన్సాల్ భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చిన బన్సాల్, ఆయన కుమారుడు యోగేష్ నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డారు.

  • Loading...

More Telugu News