: 'ప్రేమిస్తే' హీరోయిన్ కు పాప పుట్టింది
'ప్రేమిస్తే' హీరోయిన్ సంధ్య పండంటి పాపకు జన్మనిచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు 40 సినిమాల్లో నటించి అలరించిన సంధ్య 'అన్నవరం' సినిమాలో పవన్ కల్యాణ్ సోదరిగా నటించి, మంచి పేరు సంపాదించుకుంది. 2015 డిసెంబర్ 6న ఐటీ ఉద్యోగి వెంకట్ చంద్రశేఖరన్ ను సంధ్య వివాహం చేసుకుంది. అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న సంధ్యకు పాప పుట్టిన విషయాన్ని ఆమె స్నేహితురాలు నటి సుజ వరుణి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. బుజ్జి పాపాయితో పాటు సంధ్య దంపతులతో తాను దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. కాగా, ఈ రోజే టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ కూడా తండ్రిగా ప్రమోషన్ తీసుకున్న విషయం తెలిసిందే.