: ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిర్ లైనర్స్ కు మన ఎంపీలు చేసిన కొత్త డిమాండ్లు!
జీతాలు పెంచాలని మన ఎంపీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిర్ లైనర్స్ ను కలిసింది. పార్లమెంటరీ ప్యానెల్ చేసిన డిమాండ్ల విషయానికొస్తే.. తమకు తక్కువ ధరకే టికెట్లు విక్రయించాలని, చివరి నిమిషంలో టికెట్లు బుక్ చేసుకున్నా డిస్కౌంట్ ధరకే టికెట్లు విక్రయించాలని, సీట్లలో కూడా తమకు కోటా కల్పించాలని, ఉచితంగా ఆహారం అందించాలని, ఎయిర్ పోర్టులలో తమకు ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రోటోకాల్ మేరకు తమకు సహకరించేందుకు అధికారులను ఏర్పాటు చేయాలని, చివరి నిమిషంలో వచ్చినా త్వరగా తనిఖీలు నిర్వహించి తమను పంపాలంటూ మన ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే, ఈ డిమాండ్లను ప్రైవేట్ ఎయిర్ లైనర్లు తోసిపుచ్చారు.