: ‘రీల్’ ధోనీని సెలెక్టు చేసింది వాళ్లిద్దరేనట!


టీమిండియా క్రికెటర్ ధోనీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘ఎమ్ఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను ఎలా ఎంపిక చేశారనే విషయమై ఒక ఇంటర్వ్యూలో ధోనీ ప్రస్తావించాడు. ఒకసారి ధోనీ, ‘ధోనీ’ చిత్ర నిర్మాత అరుణ్ పాండే కలసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో యథాలాపంగా సుశాంత్ నటించిన ‘కై పోచే’ సినిమా చూశారట. అందులో సుశాంత్ క్రికెట్ ఆడుతుండటం.. అతని బౌలింగ్, ఫీల్డింగ్ స్టైల్ చూసి ఇద్దరూ ముచ్చటపడ్డారు. ‘ధోనీ’ సినిమా కనుక నిర్మిస్తే ఇతన్నే హీరోగా పెట్టుకోవాలని అప్పుడే వీరు నిర్ణయించుకున్నారట.

  • Loading...

More Telugu News