: అవంతి కళాశాల ఫ్రెషర్స్ డే సందర్భంగా నడి రోడ్డుపై విద్యార్థుల వీరంగం
హైదరాబాదు, సరూర్ నగర్ లోని అవంతి పీజీ కళాశాల ఫ్రెషర్స్ డే రసాభాసగా మారింది. ఫ్రెషర్స్ డే నిర్వహిస్తున్న విద్యార్థులు పూటుగా తాగి నడి రోడ్డుపై పరస్పర దాడులకు దిగారు. దీంతో అక్కడ స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దగ్గర్లోని షాపింగ్ సెంటర్లలోని సీసీ కెమెరాల్లో విద్యార్థులు పరస్పరం దాడులకు దిగిన సన్నివేశాలు రికార్డు అయ్యాయి. విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడులకు దిగడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రెండు వర్గాల విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.