: చిన్నారిపై అత్యాచారం కేసులో దోషికి 'జీవించి ఉన్నంత కాలం జైలు శిక్ష'... సంచలన తీర్పునిచ్చిన కర్నూలు కోర్టు
గతంలో ఓ ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో సమగ్ర విచారణ జరిపిన కర్నూలు న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి, జీవించి ఉన్నంత కాలం జైలు శిక్ష అనుభవించేలా సంచలన తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు పట్ల బాధితురాలి బంధువులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మహిళల పట్ల ఎవరయినా అసభ్యంగా ప్రవర్తిస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఈ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేసిన డీఎస్పీ రమణమూర్తితో పాటు పలువురు పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ రవికృష్ణ అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.