: నాలుగు రోజులుగా మాజీ ఏఎస్పీని ప్రశ్నిస్తున్న సిట్


కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలు కలిగిన పోలీసు అధికారులను సిట్ ప్రశ్నించడం ప్రారంభించింది. అదనపు ఎస్పీగా పని చేసి రిటైర్ అయిన ఓ మాజీ పోలీసు అధికారిని సిట్ నాలుగు రోజులుగా అదుపులో ఉంచుకుని ప్రశ్నిస్తోందని సమాచారం. అప్పటి హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య సమయంలో డీఎస్పీగా పని చేసిన ఆయనకు నయీంతో బాగా సంబంధాలున్నాయని సిట్ అధికారులు గుర్తించారు. అప్పట్లో ఆయన భువనగిరి డీఎస్పీగా పని చేశారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News