: 'ధోనీ' చిత్రాన్ని నిషేధించిన పాకిస్థాన్


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటోబయోగ్రఫీ 'ఎం.ఎస్.ధోనీ: ఏన్ అన్ టోల్ట్ స్టోరీ' సినిమాను పాకిస్థాన్ నిషేధించింది. యూరీ సెక్టార్ ఘటన అనంతరం మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పాకిస్థాన్ సినీ నటులను దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించిన నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఇకపై భారతదేశానికి చెందిన ఏ సినిమాను కూడా పాకిస్థాన్ థియేటర్లలో ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ధోనీ చిత్రం ఈ నిషేధాన్ని ఎదుర్కోనుంది.

  • Loading...

More Telugu News