: ఎవరికి కావాలి మీ ప్రత్యేక ప్యాకేజీ?: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా హోదానే కోరుకుంటున్నారని ప్యాకేజీని వద్దంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... హోదా కోసం తాము ఢిల్లీ వరకు వెళ్లి పోరాడినట్లు తెలిపారు. హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ‘ఎవరికి కావాలి మీ ప్రత్యేక ప్యాకేజీ?.. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. బీజేపీ, టీడీపీ నేతలు డబ్బులు పంచుకొని తినడానికే ప్యాకేజీ అంటూ ప్రజలని మభ్యపెడుతున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.