: తెలంగాణలో తుదిదశకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ.. కొత్తగా 3252 పోస్టులు
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. దసరానుంచే రెవెన్యూ, పోలీసు కార్యాలయాలు పనిచేసేలా కసరత్తు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనల కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆయా శాఖాధిపతులతో సీఎంవో అదనపు ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో సమావేశమయ్యారు. కొత్తగా 3252 పోస్టులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఉద్యోగుల సంఖ్య, కేడర్ పోస్టులు భర్తీ ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పై స్థాయి పోస్టుల్లో కొన్నింటిని అర్హతలను బట్టి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.