: కావేరీ జలాల అంశంపై కర్ణాటకలో అఖిలపక్ష సమావేశం.. నీరు వదలకూడదని నిర్ణయం


కావేరి జలాల వివాదంపై తాజాగా మ‌రోసారి సుప్రీంకోర్టుకు వెళ్లిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి మ‌ళ్లీ నిరాశ ఎదురైన విష‌యం తెలిసిందే. తాము ముందుగా ఆదేశించినట్లే 6 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు కర్ణాట‌క‌ విడుదల చేయాల్సిందేన‌ని సుప్రీంకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేయ‌డంతో క‌ర్ణాట‌క‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ‌రామ‌య్య ఈ అంశంపై ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సుప్రీం ఆదేశాల‌పై చ‌ర్చించిన క‌ర్ణాట‌క రాజ‌కీయ పార్టీలన్నీ త‌మిళ‌నాడుకు నీటిని విడుద‌ల చేయ‌రాద‌నే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దీంతో అఖిల‌ప‌క్షంలో వ‌చ్చిన అభిప్రాయాన్నే పాటించాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

  • Loading...

More Telugu News