: గ్రామానికో నయీమ్ తయారయ్యాడు: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఆరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో గ్రామానికో నయీమ్ తయారయ్యాడని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, దోపిడీ పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. అవినీతిని ప్రోత్సహిస్తూ చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ అవినీతికి పాల్పడుతూ దొరకడమే అందుకే ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్నది నదుల అనుసంధానం కాదని, అవినీతి అనుసంధానమని ఆయన ఎద్దేవా చేశారు.