: బీసీసీఐకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు


లోధా కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా)కి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. తామిచ్చిన సిఫార్సులను బీసీసీఐ విస్మరించిందని నోడు లోధా కమిటీ కోర్టుకు నివేదిక ఇవ్వగా, ప్రధాన న్యాయమూర్తి టీఎస్ థాకూర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీసీఐ పెద్దలు తమకు తామే చట్టమని భావిస్తున్నట్టు అనిపిస్తోందని, వారిలా లోధా కమిటీ సిఫార్సులను పక్కన బెడతారని భావించలేదని ఆయన అన్నారు. ఈ సిఫార్సులకు బీసీసీఐ కట్టుబడి వుండాల్సిందేనని, లేకుంటే చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్, ఆపై బెట్టింగ్ బాగోతాలు వెలుగు చూసిన తరువాత సుప్రీంకోర్టు లోధా కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన కమిటీ, బీసీసీఐ చీఫ్ సహా పలువురు అధికారులను తక్షణం తొలగించాలని సిఫార్సు చేసింది. బోర్డును ప్రక్షాళన చేయాలని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News