: భారత్ చర్యలన్నీ గమనిస్తున్నాం... అడుగు ముందుకేస్తే దెబ్బ తీసేందుకు రెడీ: పాక్


భారత సరిహద్దులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, ఆవలి నుంచి ఏ చర్య తీసుకున్నా, గట్టి దెబ్బతీసేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ సైన్యాధికారి ఒకరు హెచ్చరించారు. "తూర్పు వైపు జరుగుతున్న అన్ని చర్యలనూ గమనిస్తున్నాం. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం" అని మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ సలీమ్ బజ్వా వ్యాఖ్యానించారు. పెషావర్ లో జరిగిన ఓ భద్రతా సమావేశంలో ఆయన ప్రసంగించారు. తమపై దాడులు చేయాలని చూస్తే, బుద్ధి చెబుతామని అన్నారు. సరిహద్దుల్లో 20 ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ సరిహద్దుల్లో భద్రతపై సమీక్షను నిర్వహించారు. యూరీపై ఉగ్రవాదుల దాడి అనంతరం ఇరు దేశాల మధ్యా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడి తమ పని కాదని పాక్ చెబుతూ వస్తోంది.

  • Loading...

More Telugu News