: చైనా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సూర్య సినిమా ‘24’
చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో తమిళ హీరో సూర్య నటించిన ‘24’ చిత్రం ప్రదర్శితమైంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. సమంత, నిత్యమీనన్ హీరోయిన్లుగా నటించగా తండ్రీకొడుకులుగా సూర్య అద్భుత నటనను ప్రదర్శించారు. సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కించిన ఈ సినిమా అభిమానులను అలరించింది. చైనాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 675 సినిమాలు ఎంపిక కాగా అందులో సూర్య నటించిన ‘24’ కూడా ఉండడం గమనార్హం.