: రాజకీయాల్లో చేరే ప్రసక్తే లేదంటున్న షారుక్ ఖాన్!
బాలీవుడ్ 'బాద్ షా' షారుక్ ఖాన్ ప్రతి అంశంపైనా ఎంతో అవగాహన వున్న వ్యక్తి అనటంలో సందేహం లేదు. ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అభిమానులను తనదైన శైలిలో అలరిస్తూ, గడసరి సమాధానాలు కూడా ఇస్తాడు. తాజాగా కేరళలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న షారుక్ ను.. రాజకీయాలపై మీడియా ప్రశ్నించింది. దానికి సమాధానం ఇస్తూ.. తాను రాజకీయాల్లో చేరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పాడు. అకస్మాత్తుగా రాజకీయనాయకుడిని కాలేనని సమాధానం ఇచ్చాడు. అదొక వృత్తి అనీ, దానిపై తప్పకుండా మనకు అవగాహన ఉండాలని షారుక్ పేర్కొన్నాడు. రాజకీయాల్లోకి రావడంకన్నా తనకు వ్యోమగామి అవాలని వుందని చెబుతూ అందర్నీ నవ్వించాడు.