: నడి సంద్రంలో ఆగిన అండమాన్ నౌక.. ఆందోళనలో ప్రయాణికులు
విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఓ నౌక సముద్రం మధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ఈ నౌక విశాఖ నుంచి ఆరు గంటలు ప్రయాణించిన తర్వాత సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో మరో మార్గం లేక నౌక అధికారులు దానిని సముద్రంలో నిలిపివేశారు. నౌక ప్రయాణానికి వాతావరణం కూడా సహకరించకపోవడం ఒక కారణంగా తెలుస్తోంది. ఇక నడి సముద్రంలో నౌక నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగుతుందో, ఎందుకు ఆపివేశారో తెలియక భయంతో గడుపుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.