: 256 పోస్టుల భర్తీకి మూడు రోజుల్లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
256 పోస్టుల భర్తీకి గాను మూడ్రోజుల్లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఒక ప్రకటన చేశారు. ఏపీపీఎస్సీ సభ్యులతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, మొత్తం 4,009 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, అయితే, ముందుగా 256 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని, మిగతా పోస్టుల భర్తీకి ఈ ఏడాది చివరి నాటికి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఈ పోస్టులకు 25 వేల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కనుక దరఖాస్తు చేసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని ఉదయ్ భాస్కర్ చెప్పారు.