: ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకోనున్న తెలంగాణ ప్రభుత్వం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది. ‘మన టీవీ’ సేవల్ని మరింత మెరుగుపరచుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం రేపు ఈ ఒప్పందం చేసుకోనుంది. ‘మన టీవీ’ ద్వారా తెలంగాణలోని వివిధ సామాజిక సమస్యలను నిర్మూలించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేయనుంది. వివిధ వినూత్నమైన కార్యక్రమాలు ప్రసారం చేయనుంది. గ్రూప్-2 ఉద్యోగ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ‘మన టీవీ’ ఛానెల్ ద్వారా కోచింగ్ కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో మెరుగైన ప్రసారాలు అందించాలంటే ఇస్రోతో ఒప్పందమే సరైన విధానమని తెలంగాణ సర్కారు భావిస్తోంది.