: రామోజీరావును ‘అభినవ బ్రహ్మ’గా అభివర్ణించిన వెంకయ్యనాయుడు


‘ఈనాడు’ గ్రూప్ అధిపతి రామోజీరావును ‘అభినవ బ్రహ్మ’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ఇండీవుడ్ కార్నివాల్ ముగింపు ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రపంచ సినీ పరిశ్రమను భారత్ కు తీసుకవచ్చింది ఇండీవుడ్ కార్నివాల్ ను అని ఆయన ప్రశంసించారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లా ఇండీవుడ్ కొత్త పదమని అన్నారు. ప్రపంచంలోని ఏడు వింతల్లో రామోజీ ఫిలింసిటీ ఒకటని, వినోద రంగంలో సినిమాకు పోటీ లేదని అన్నారు. సినిమా కొత్త సందేశం, ఆలోచనలు ఇస్తుందని, సినిమాలకు సంబంధించి నాకు తెలిసిన జ్ఞానం పరిమితమని, అయినా తనకు ఎక్కువ మంది సినీ నటులు తెలుసంటూ వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News